ప్రస్థుత పరిస్థుతులలో సినిమా సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపై విడిపోవడం ఆతరువాత మరొకసారి పెళ్ళి చేసుకోవడం సాధారణమైన విషయం. అయితే కృష్ణ విజయనిర్మల ఆకాలంలో ఎవరికి వారు పెళ్ళి చేసుకుని పిల్లలను కూడ కని ఆతరువాత వారి మొదటి పెళ్ళికి సంబంధించి విడాకులు కూడ తీసుకుని 1965 ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో రహస్యంగా పెళ్ళి చేసుకోవడం అప్పట్లో ఒక సంచలనం.
ఈ న్యూస్ బయటకు పొక్కడంతో ఆరోజులలో కృష్ణ నటించిన సినిమా పోస్టర్లు కృష్ణ విజయనిర్మల దిష్టిబొమ్మలను కొందరు అప్పట్లో తగలపెట్టారు. అటువంటి వివాదాలు తరువాత జరిగిన వీరిద్దరి పెళ్ళి అన్యోన్య దాంపత్యంగా మారడమే కాకుండా కృష్ణను సూపర్ స్టార్ గా మార్చడంతో విజయనిర్మల సలహాలు కృష్ణ ఫిలిం కెరియర్ పై ఎంతో ప్రభావితం చేసాయి.
కృష్ణ కెరియర్ కు మైల్ స్టోన్ మూవీస్ గా మారిన ‘అల్లూరి సీతారామరాజు’ ‘పండంటికాపురం’ ‘దేవుడు చేసిన మనుషులు’ దగ్గర నుండి మొదటి తెలుగు కౌ బాయ్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ లాంటి ఎన్నో హిట్ సినిమాలను కృష్ణ నిర్మించే సాహసం చేయడంలో విజయనిర్మల ప్రోత్సాహ సహకారాలు అత్యంత కీలకం అని అంటారు. ఈ సినిమాల ఘన విజయం తరువాత కృష్ణ విజయనిర్మల జంట సూపర్ పెయిర్ గా మారిపోయి వీరిద్దరూ కలిసి 47 సినిమాలలో నటించారు అంటే వీరిద్దరి సాన్నిహిత్యం ఎంత ఘాడమైందో అర్ధం అవుతుంది.
ఆ కాలంలో ఒక మహిళ దర్శకురాలు అవ్వడమే కష్టం. సూపర్ స్టార్ కృష్ణ ప్రోత్సాహం ఉన్నా విజయనిర్మల సినిమాలకు దర్శకత్వం వహించే ఆరోజులలో అలనాటి గొప్ప నటులు విజయనిర్మలకు దర్శకత్వం వహించే సామర్ధ్యం ఉందా అని అప్పటి టాప్ స్టార్స్ సందేహాలు వ్యక్త పరిచినప్పుడు మహిళా దర్శకురాలిగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి ‘గిన్నీస్ బుక్’ రికార్డును క్రియేట్ చేసిన విజయనిర్మలకు ‘పద్మశ్రీ’ బిరుదును అందుకోవాలి అన్నది విజయనిర్మల జీవితంలో తీరని కోరిక. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మొట్టమొదటి ‘మేడ్ ఫర్ ఈచ్ ఆదర’ కపుల్ గా దరిదాపు 49 సంవత్సరాల వైవాహిక బంధాన్ని కృష్ణతో కొనసాగించి నిన్న రాత్రి మరణించడం ఒక విధంగా సూపర్ కృష్ణకు తీరాని లోటు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఒక మహిళా దర్శకురాలిగా నటిగా విజయనిర్మల క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పట్లో ఏమహిళా దర్శకురాలు బ్రేక్ చేయగల సత్తా ఎవరికీ లేదు అన్నది వాస్తవం..