ఎన్టీఆర్ బయోపిక్ అందించిన చేదు అనుభవం తర్వాత నందమూరి బాలకృష్ణ ఈసారి తన లేటెస్ట్ సినిమా విషయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. కేఎస్ రవికుమార్‌ దర్శకత్వంలో ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కథ గురించి అదేవిధంగా ఈ మూవీ టైటిల్ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి.  

వాస్తవానికి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో ప్రారంభం కావలిసిన ఒక భారీ మూవీని పక్కకు పెట్టి బాలయ్య కెఎస్. రవికుమార్ మూవీని ఎంచుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత వచ్చిన మార్పులతో ఈమూవీ కథలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు కథ పూర్తిగా ఫైనల్ కావడంతో ఈమూవీ షూటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది.

ఇలాంటి పరిస్థుతులలో అందరి అంచనాలను తలక్రిందిలు చేస్తూ ఈమూవీకి ఒక షాకింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి ‘క్రాంతి’ అన్న టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్. అయితే యాధృశ్చికంగా ఈ టైటిల్ కు జూనియర్ నేపధ్యం కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జూనియర్ నటించిన ‘కంత్రి’ సినిమాలోని హీరో పాత్ర పేరు క్రాంతి.

వాస్తవానికి బాలకృష్ణ లేటెస్ట్ మూవీకి రూలర్ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ కంటే ‘క్రాంతి’ ఈమూవీ కథకు అన్నివిధాల సరిపోతుంది అని బాలయ్య సూచించడంతో ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. దీనితో మారిన రాజకీయ పరిస్థుతులలో తెలుగుదేశం వర్గాలు బాలయ్య జూనియర్ ల సాన్నిహిత్యం కోరుకుంటూ ఉంటే అనుకోకుండా ఇలా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ బాలయ్య జూనియర్ ల సాన్నిహిత్యానికి తెర లేపిందా అంటూ నందమూరి అభిమానులు ఆనంద పడుతున్నారు.. 
 
Top