రాముడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తెలంగాణ పోలీసులు బహిష్కరించిన సంగతి తెలిసిందే.  దీనితో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. దళిత సంఘాల నేతలు కత్తి మహేష్ బహిష్కరణను తీవ్రంగా ఖండించాయి.  మందకృష్ణ మాదిగ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది నగర బహిష్కరణ కాదు. కేవలం కుల బహిష్కరణ మాత్రమే అని తెలంగాణ సర్కార్ మీద విరుచుకుపడ్డారు.  అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ పాదయాత్ర మొదలుపెడతానని తెలంగాణ పోలీసులను కోరినాడు.
దీనికి తెలంగాణ పోలీసులు  పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారు. అయితే అనూహ్యంగా కత్తి మహేష్ బహిష్కరణ రెండు రోజుల తర్వాత పరిపూర్ణానందస్వామి ను కూడా నగర బహిష్కరణ చేస్తున్నట్టు  తెలంగాణ పోలీసులు నోటీసు జారీ చేశారు. అంతకుముందు కొన్ని సభలలో హిందువులును  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు కారణాలుగా చూపిస్తూ స్వామి పరిపూర్ణానందను ఆరునెలల పాటు నగర బహిష్కరణ చేస్తున్నట్టు నోటీసులిచ్చి  పంపించారు.
అయితే ఇప్పుడు నాగబాబును కూడా  నగర బహిష్కరణ చేస్తారూ అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి కారణం లేకపోలేదు. కత్తి మహేష్ కి కౌంటర్ గా నాగబాబు కూడా హిందువులు ను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. హిందువులు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి వస్తుందని ఒక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నాగబాబు,  దీంతో నాగబాబును నగర బహిష్కరణ చేయొచ్చని ప్రచారం ఊపందుకుంది. ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ నాగబాబు వ్యాఖ్యలు కూడా రెచ్చ కొట్టే విధంగా ఉన్నాయంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు.
 
Top