అగ్ర కథానాయిక అనుష్క ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్‌లో గాయపడ్డారట. ఇటీవల సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్వీటీ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోమని అనుష్కకు సూచించినట్లు సమాచారం.

అయితే ఈ విషయాన్ని మీడియాకు చెప్పడానికి అనుష్క ఒప్పుకోలేదట. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించి అనుష్క గానీ, చిత్రబృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోపక్క అనుష్క ‘సైలెన్స్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులోని ఓ కీలక పాత్రలో అనుష్క నటిస్తున్నారు. తనకేగాయం తగలలేదని, అసలెందుకిలాంటి పుకార్లు పూడతాయో తనకర్ధం కాదని అమ్మడు చెప్పడం ఒకింత ఆచ్చర్యం.

సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అమిత్‌ త్రివేదీ బాణీలు అందిస్తున్నారు. విజయ్‌సేతుపతి, నయనతార, సుదీప్‌, అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
Top