నిన్న తిరుపతిలో రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించిన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని భక్తుడిలా మారిపోయిన వర్మను చూసి నాగార్జున ‘అన్నమయ్య’ లుక్ సరిపోదు అంటూ చాలామంది జోక్ చేస్తున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా నిన్న సాయంత్రం జరిగిన ఈమూవీ పోస్టర్ లాంచ్ ఫంక్షన్ లో వర్మ అనేక ట్విస్ట్ లు ఇస్తూ మాట్లాడుతూ ఏకంగా తాను సినిమాగా తీయబోతున్న లక్ష్మిపార్వతికే ప్రశ్నలు వేసి ఆమెను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. తనదైన లాజిక్కులతో వర్మ అడిగిన ప్రశ్నలు ఒక విధంగా లక్ష్మి పార్వతికి షాకింగ్ అనుకోవాలి. 

ఎన్టీఆర్ నటించే రోజులలో ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ముఖ్యంగా శ్రీదేవి జయసుధ జయప్రద వంటి అందగత్తెలు ఉంటే వారందర్నీ పక్కకు పెట్టి మిమ్ములన్ని ఎలా ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్నాడు అంటూ ఏకంగా లక్ష్మీ పార్వతికి ప్రశ్న వేసి ఆమె మైండ్ బ్లాంక్ చేసాడు. అంతేకాదు  ‘మీ పర్సనాల్టీతో ఆయన్ను ఆకట్టుకున్నందుకు నేను చింతిస్తున్నా’ అంటూ వర్మ చేసిన కామెంట్స్ కు ఒక్క క్షణం లక్ష్మీ పార్వతి కూడ ఆశ్చర్య పడింది. 
 
Top